
మానవ సేవే మాధవ సేవ. ఈ నానుడిని అక్షరాలా నిజం చేస్తూ అంటరానివారుగా సమాజానికి దూరంగా తిండి తిప్పలకు నోచుకోలేని ఎంతో మంది అభాగ్యులకు మీకు మేమున్నాం అంటూ వారికి అండగా నిలిచేవాళ్ళని మీరు ఎపుడైనా చూశారా..?
అంతెందుకు గుడికి వెళ్తాం భగవంతుడికి దణ్ణం పెట్టుకుంటాం కాని బయట బిక్షమెత్తుకునే ఒక్కరికి కూడా ఒక్క రూపాయి దానం చెయ్యం. ఒకవేళ చేసినా వాళ్ళకి దూరంగా నిలబడి రూపాయి విసిరేసి వెళ్ళిపోతాం. నిజమే కదా..?
రోడ్డు మీద తిరుగుతూ ఉన్నపుడు చాల మంది అభాగ్యులు ఆరోగ్యం సరిగా లేకనో ఆకలితోనో అల్లాడుతూ మనకు కనిపించినా చూసి చూడనట్లు వెళ్ళిపోతాం. లక్షలు లక్షలు సంపాదిస్తునే ఆకలిగా ఉన్నవాళ్ళకి అన్నం పెట్టడానికి ఆలోచిస్తాం.
అంతెందుకు బస్సులో ప్రయాణం చేసేటపుడు మన వయసుకంటే పెద్దవాళ్ళు నిలుచున్నా పట్టించుకోకుండా వాళ్ళకి సీటు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం.
అంతెందుకు బస్సులో ప్రయాణం చేసేటపుడు మన వయసుకంటే పెద్దవాళ్ళు నిలుచున్నా పట్టించుకోకుండా వాళ్ళకి సీటు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం.
ఇంకా చెప్పాలంటే ఇంట్లొ మన అమ్మ ఆపసోపాలు పడుతూ ఆరోగ్యం సరిగా లేకున్నా మన ముందే తిరుగుతున్నా అసలు అమ్మ ఎందుకు నీరసంగా ఉంది అని ఆలొచించకుండా మన పనిలో మనం ఉండిపోతాం.
మన పుట్టుకకి కారణం అయిన తల్లితండ్రులకి ఏమైనా జబ్బు చేస్తే వాళ్ళని పట్టించుకోకుండా బయటకి తరిమేసే చాలామంది కసాయి కొడుకులని కూతుర్లని చూస్తుంటాం. వాళ్ళకి వైద్యం సరికాదు కదా పట్టెడు అన్నం పెట్టకుండా బయటికి నెట్టేసే క్రూర మ్రుగాళ్ళని చూస్తుంటాం.
మన పుట్టుకకి కారణం అయిన తల్లితండ్రులకి ఏమైనా జబ్బు చేస్తే వాళ్ళని పట్టించుకోకుండా బయటకి తరిమేసే చాలామంది కసాయి కొడుకులని కూతుర్లని చూస్తుంటాం. వాళ్ళకి వైద్యం సరికాదు కదా పట్టెడు అన్నం పెట్టకుండా బయటికి నెట్టేసే క్రూర మ్రుగాళ్ళని చూస్తుంటాం.
చెప్పాలంటే పెద్ద పెద్ద చదువులు చదువుకున్నప్పటికీ సంస్కారహీనులుగా తయారయ్యాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మనలో మానవత్వాన్ని నిద్రలేపుతూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న ఒక టీం గురించి రాయబోతున్నాను కాబట్టి.
సర్వ్ నీడి (SERVE NEEDY) ఆర్తులను ఆదుకోండి. ఇదే ఈ టీం యొక్క నానుడి. 2014 లో ప్రారంబించబడిన "SERVE NEEDY ORGANIZATION" అప్పటి నుండి ఇప్పటివరకూ అనాధలకూ, ఆర్తులకూ 24/7 సేవలను అందిస్తునే ఉంది.
అతి భయంకరమైన దయనీయమైన స్థితిలో సహాయం కోసం యెదురు చూసేవాళ్ళకి అండగా నిలుస్తూ కళ్ళున్నా లేనట్లు జీవించే ఈ సమాజం కళ్ళు తెరిపిస్తున్నారు. ఈ టీం గురించి రాయటం నిజంగా నా అద్రుష్టంగా భావిస్తున్నాను.
కుటుంబం, సమాజం నుండి వెలివేయబడిన ఆర్తులకి మేమున్నాం అంటూ చేయందిస్తున్నారు. "అన్న దాత" అనే ఈవెంట్ ద్వారా ప్రతిరోజూ చాలామంది ఆర్తులకి పోషకాలు నిండిన ఆహారాన్ని అందిస్తున్నారు.
తెలియని జబ్బు సోకడంతో, పిల్లలు ఇంట్లో నుండి గెంటివేయడంతో సహాయం కోసం చూస్తున్న ఎందరికో అండగా నిలుస్తున్నారు.
అందరూ ఉన్నా ఎవరూ లేని ఏకాకి బ్రతుకు బ్రతుకుతూ ప్రాణాలను కోల్పోయిన వారికి దహన సంస్కారాలు చేసి వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరుస్తున్నారు.
అనాధ పిల్లలను అక్కున చేర్చుకుని వాళ్ళకి మంచి భవిష్యత్తుని అందజేస్తున్నారు.
దయచేసి ఆహారాన్ని వ్రుధా చెయ్యకండి.
మన ఇంట్లో పుట్టిన రోజు జరిగితే ధూం ధాం అని మహా ఖర్చు పెట్టి పండుగలా చెస్తాం కాని చాలమంది అసలు నేను పుట్టినరోజు జరుపుకుంటానో లేదో అనే ఆలోచనతోనే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతారు.
మీ పిల్లల పుట్టిన రోజుకైనా కొంతమందికి అన్నదానం చెయ్యండి. మీరు పెట్టే పట్టెడు అన్నం కోసం చాలమంది యెదురు చూస్తున్నారు.
మీ పిల్లల పుట్టిన రోజుకైనా కొంతమందికి అన్నదానం చెయ్యండి. మీరు పెట్టే పట్టెడు అన్నం కోసం చాలమంది యెదురు చూస్తున్నారు.
ఆకలిగా ఉన్న తాతకి పట్టెడన్నం పెట్టి తన కళ్ళలో సంతోషాన్ని ఓసారి చూడండి.. మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికినా ఆ ఆత్మ త్రుప్తి దొరకదు.
ఒక్కటి అని కాదు అన్ని రకాలుగా సమాజానికి సహాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్న "SERVE NEEDY" గౌతం అన్న అండ్ టీం కి నా వందనాలు.
"SERVE NEEDY" టీంకి మావంతు సహాయం చేయాలన్నదే మా ఆకాంక్ష. మీ వంతు సహాయాన్ని ఈ WEBSITE నుంచి అందజేయగలరు.
Follow @timepasspopcorn