
నల్లధనాన్ని నిర్మూలించడం సంగతి దేవుడికెరుక అసలు ఈ కొత్త నోట్ల వల్ల బడా బాబులు ఇంకా రెచ్చిపోతున్నారు.
రెండు వేలకోసం 3 గంటలు లైనులో నిల్చున్నాను. అలాంటిది వీళ్ళకి కోట్ల కొద్దీ కొత్త నోట్లు ఎలా దొరుకుతున్నాయి?
డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు బడా బాబులకి బ్యాంకు మేనేజెర్లూ, బ్యాంకు సిబ్బందీ దాసోహం అంటారా?
లేకపోతే అసలు లైనులో నిలుచుకోకుండా కనీసం బ్యాంకు మెట్లు ఎక్కకుండా వీళ్ళకి కోట్ల రూపాయల కొత్త నోట్లు ఎలా చేరుతున్నాయి?
అసలు డబ్బులు లేక జనాలు చస్తున్నారు కాని బ్యాంకు వాళ్ళు మాత్రం 10:30 కి మాత్రమే బ్యాంకు తలుపులు తీస్తున్నారు. ఏం ఉదయం 7 కి తీయొచ్చుగా? ఎందుకు తియ్యరు అంటే రూల్ అంటారు.
డబ్బుల కోసం పడిగాపులు కాస్తున్నారు మనలాంటి చాలమంది సామన్య ప్రజలు. ATM లో డబ్బులు పెట్టొచ్చుగా ఎందుకు పెట్టరు అంటే డబ్బులు లేవు అంటారు (మరి ఉన్నదంతా బడాబాబులకి ఇచ్చేస్తే ఇంక మనకు ఏం మిగులుతాయ్? )
మాకు చాలా అవసరం మహా ప్రభో ఇంకొ 2000 ఇవ్వండి అని బ్రతిమాలుకున్నా 2000 కంటే ఎక్కువ ఇవ్వరు ఎందుకంటే రూల్ అంటారు మా బ్యంకులో డబ్బులు లేవు అంటారు.
కాని,
ఎవరన్నా బడా బాబుల తొత్తులు వచ్చారనుకోండి వాళ్ళు లైనులో నిల్చోనక్కర్లేదు డైరెక్టుగా క్యాషియర్ దగ్గరకి వెళ్ళి ఒకే సారి 30000 నుండి 40000 వేల రూపాయల కొత్త నోట్లు తీసేసుకుంటారు. మరి వీళ్ళ కి రూల్ ఎక్కడికి వెళ్ళింది? (ఇది నిజంగా నిజం హైదరబాదులో ఒక బ్యాంకులో జరిగింది అప్పుడు మేము అడిగిన ప్రశ్నకు బ్యాంకు అధికారిణి మీకు క్యాష్ కావాలా వద్దా అని అడిగారు)
ఒక లైనులో డబ్బులు డ్రా చెయ్యటం కష్టం కాబట్టి రెండు మూడు కౌంటర్లు ఓపెన్ చెయ్యొచ్చుగా? చెయ్యరు ఎందుకు అంటే రూల్ అంటారు..
అసలు రోజుకు 2000- 2500 మాత్రమే తీయాలి అనే రూల్ బడా బాబులకి, రాజకీయ నాయకులకి, సినిమా యాక్టర్లకి ఎందుకు వర్తించట్లేదు?
భారత దేశంలొ పవర్ ఉన్నవాడికే అన్ని దొరికితే మాములు మనుషులైన మనం ఏం చెయాలి? ఇప్పటికే బ్యంకుల్లో ATM ల దగ్గర పడిగాపులు కాసే వాళ్ళు ఎవరన్నా బ్యాంకర్స్ ని ఏదైన ప్రశ్న వేస్తే ఏంటి మీకు డబ్బులు కావలా వద్దా అని బ్యాంకర్లే బెదిరిస్తున్నారు.
అరే చదుకున్న వాళ్ళే బ్యాంకర్లని ఏం అడగలేకున్నారు మరి మాములు జనాలు ఏం చెయ్యగలరు చెప్పండి?
నల్ల ధనాన్ని నిర్మూలించడం ఏమో కాని 2000 రూపయల నోట్ల విడుదలతో బడాబాబులకి పండగ మొదలైనట్లైంది.
ఒక్కొక్కడి దగ్గర 2 కోట్లు, 4 కోట్లు 100 కోట్ల కొత్త నోట్లు చేరుతుంటే సామన్య జనాలు ఉదయాన్నే 5 నుండి ATMల దగ్గర పడిగాపులు కాస్తూ సొమ్మసిల్లుతున్నారు.
మన పోలీసులు రాజకీయ నాయకులు అంతా ఏం చేస్తున్నారో ఇంక ఆ భగవంతుడికే తెలియాలి.
Follow @timepasspopcorn