2016 నవంబరు 8 చీకటి ధనానికి చీకటి రాత్రి.. కాని నిజాయితీగ సంపాదించిన మన డబ్బు పదిలం ఎలా.?


భారతదేశానికి పట్టిన చెదలను(అంటే నా బాషలో నల్లధనం) వదిలించే సంచలన నిర్ణయాన్ని మన ప్రధాన మంత్రి గారు తీస్కోవడం నిజంగా అభినందించదగ్గ విషయమే. నవంబరు 9 ఉదయం 12 గంటల నుండి ఈ నిర్ణయం అమలు చెయ్యబడింది. అంటే 1000 మరియు 500 రూపాయల నోట్లు ఈరోజు నుండి బంద్. 

ఈ నిర్ణయాన్ని తీసుకోవటానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. 1.నల్లధన్నాన్ని చట్టపరం చెయ్యడం. 2.మనదేశంలో నకిలి 500,1000 నోట్లు ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చెయ్యలి అని చూసే  తీవ్రవాదుల యొక్క ఆర్థిక పరమైన చర్యలను నిర్మూలించడం.

కాని చాలమందికి తెలియని విషయం ఏంటంటే 1000 మరియు అంత కంటే పెద్ద నోట్లను(10000,5000) నిర్మూలించే విధానాన్ని ఇంతకుముందే మన దేశంలో జనవరి 1946 మరియు 1978 లో అమలు చేశారు. మళ్ళీ దాదాపు 37 సంవస్తరాల తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది.

ఈ నిర్ణయంతో ప్రస్తుతం దేశంలో ఉన్న అక్రమంగా దాచుకున్న మొత్తం నల్లధనాకిని చిల్లు పడింది. అంటే బడా బాబులు దాచుకున్న,దోచుకున్న నల్లధనాన్ని ఇంక భగవంతుడు కూడ కాపాడటం కష్టమే.   

కాబట్టి ఇలాంటి సమయంలో మనదగ్గర ఉన్న చట్టపరమైన ధనాన్ని మార్చుకోవటానికి ఈ క్రింది విషయాలను గమనించండి. 

  1. మీదగ్గర ఉన్న 500 మరియు 1000 రూపయల నోట్లను అధికారిక బాంకులలో నవంబరు 10 నుండి డిశెంబరు 10 లోపు జమచెయ్యండి. డబ్బులు డ్రా చెయ్యాలి అనుకుంటే ఒక రోజుకి 10000 రూపాయలు మరియు వారానికి 20000 రూపాయలు మాత్రమే డ్రా చెయ్యాలని మర్చిపోకండి. 
  2. రద్దు చెయ్యబడిన 1000 మరియు 500 రూపయల నోట్లకు బదులుగా కొత్త 500 మరియు 2000 రుపాయల నోట్లు ఇవ్వబడతాయి. కాని నవంబరు25 తర్వాత కరెన్సి మార్చుకోవాలంటె మీ యొక్క ID కార్డును కావాల్సిందే.   
  3. ఇంధన స్టేషన్లు(Petrol Stations, Gas Stations), Hospitals 500 మరియు 1000 రుపాయల నోట్లను  మొదటి 72 గంటల వరకు Accept చేస్తాయి.
  4. మొదటి 72 గంటలవరకు అన్ని ట్రావెల్ బుకింగ్స్(Bus,Train,Air) కూడా 500 మరియు 1000 నోట్లను Accept చేస్తాయి. 
  5. మీ దగ్గర ఉన్న కరెన్సిని బ్యాంకు చెక్కుల రూపంలో కాని, డిడి ల రూపంలో కాని, Credit మరియు Debit కార్డుల ద్వార కాని మార్చుకోవాలి.
  6. నవంబరు 9 న అన్ని అధికారక బ్యాంకులు మూయబడి ఉంటాయి. అన్ని ATM లు నవంబరు 9 మరియు 10 తేదీలలో పనిచెయ్యవు.
  7. డిశెంబరు 30 లోపు ఎవరన్నా 1000 మరియు 500 నోట్లను మార్చుకోవడం ఆలశ్యం అయినట్లైతే అలాంటి వాళ్ళు Reserve Bank Of India లో March 31 లోపు ఒక Declaration Form Submit చేసి మార్చుకోవచ్చు. 
  8. ఈ సంచలన నిర్ణయం Electronic Transaction  పైన ఎలాంటి ప్రభావం చూపించదు.
పేదరికాన్ని నిర్మూలించలంటే నల్లధనాన్ని, లంచగొండితనాన్ని పారద్రోలాలి.
భారతదేశ ప్రధానమంత్రీ మీకు జోహారు..!!



Article By Prasuna
-->