జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ..వీళ్ళ జీతాలు ఎంతో తెలుసా.?


జబర్దస్త్ ఖతర్నాక్ కామెడి షో.. అదరగొట్టే నవ్వుల పంచ్ డయలాగులతో పెద్దా చిన్నా ముసలి ముతకా అని తేడా లేకుండా అందరికీ నవ్వుల జల్లులని పంచుతున్న కామెడీషో. మొట్టమొదటిసారిగా ఫిబ్రవరి 7, 2013 వ తేదీన ఈ కార్యక్రమాన్ని ETV లో ప్రసారం చేశారు. అప్పటినుండి ఇప్పటి వరకూ తిరుగులేని రేటింగులతో ప్రేక్షకులని అలరిస్తునే ఉంది. 

మొదట అనసూయ యాంకరింగ్ చెసినప్పటికీ, తర్వాత ఆ అవకాశం రష్మికి దక్కింది. తెలుగు సినీ పరిశ్రమలో యెదురులేని కథానాయకుడు చిరంజీవి గారి తమ్ముడు నాగబాబు గారు మరియు రోజా గారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. 2014 అక్టోబరు 10 న ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రసారాలను కూడా ప్రారంభించారు. గురువారం జబర్దస్త్ మరియు శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. 

యాంకర్స్ విషయానికి వస్తే రష్మి చదువులో చాలా వెనుకంజలో ఉండటం కారణంగా +2 వరకే చదువుకుని డిస్టన్సులో డిగ్రీ పూర్తి చేసి తనకు ఇష్టమైన యాంకరింగ్ రంగంలో స్థిరపడింది. BTech పూర్తి చేసిన అనసూయ యాంకరింగ్ రంగంలొ తనకంటూ ఒక ముద్రను వేసుకుంది. అప్పటివరకూ ఎలాంటి పాపులారిటీ లేని అనసూయ మరియు రష్మి జబర్దస్త్ వల్ల బాగా పాపులర్ అయిపోయారు. 

గురువారం మరియు శుక్రవారం ప్రపంచం బద్దలైనా పట్టించుకోకుండా టివిలకి అతుక్కుపోయి ఈ షో యొక్క నవ్వుల జల్లులో తమ కష్టాలన్నిటినీ కాసేపు మరిచిపొయి నవ్వుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనటంలో సందేహం లేదు.

ఇంక టీం లీడర్ల విషయానికొస్తే జబర్దస్త్ వల్ల మంచి సినిమా అవకాశాలను తెచ్చుకుని బాగా స్తిరపడిపోయారు. ఏ సినిమాలో చూసినా జబర్దస్త్ కమెడియన్లే కనిపిస్తున్నారు.

షకలక శంకర్, చమ్మక్ చంద్ర, ధనాధన్ ధనరాజ్, సుడిగాలి సుధీర్, రైసింగ్ రాజు, హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్, సునామి సుధాకర్, రచ్చ రవి, అదిరే అభి, రాకెట్ రాఘవ ఇలా పసందైన పేర్లతో కామెడి పంచులతో జనాలను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్నారు.
ఇంక వీరి జీతాలవిషయానికొస్తే మనకు దిమ్మతిరిగి బొమ్మ కనపడాల్సిందే.

యాంకర్ రష్మి - 3 నుండి 4 లక్షలు | యాంకర్ అనసూయ - 3 నుండి 4 లక్షలు | ఛంద్ర - 2.5 నుండి 3 లక్షలు | రవి - 1 నుండి 1.8 లక్షలు | సుధీర్ - 2.5 నుండి 3 లక్షలు | శ్రీను - 1 నుండి 1.8 లక్షలు | అభి - 2.5 నుండి 3 లక్షలు | రాంప్రసాద్ - 1 నుండి 1.8 లక్షలు | రాకేశ్ - 1 నుండి 1.8 లక్షలు | రాఘవ - 2.5 నుండి 3 లక్షలు | సన్ని - 1 నుండి 1.8 లక్షలు | అప్పారావు - 1 నుండి 1.8 లక్షలు | ఆది - 2 నుండి 2.5 లక్షలు | భాస్కర్ - 2 నుండి 2.5 లక్షలు | మిగిలిన వాళ్ళు - 1 నుండి 1.8 లక్షలు  

కాబట్టి టాలెంట్ ఉంటే ఏమైనా సాధించవచ్చు అనటానికి నిదర్శనాలు మన జబర్దస్త్ కమెడియన్లు. మీలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది. సరిగ్గా వెతికి చూడండి మీకే తెలుస్తుంది. 




Article By Prasuna
-->