
ఆరోగ్యంగా ఉండాలి స్లిమ్ గా, అందంగా కనపడాలి అని ఎవరికైనా ఉంటుంది. మీరు బరువు తగ్గాలి అని అనుకుంటున్నారా?మీకు ఎప్పుడైనా అనిపించిందా? దేవుడా నేను ఎంత కష్టపడినా బరువు మాత్రం తగ్గటం లేదు అని? మీరేకాదు అందరికీ ఇదే సమస్య. అధిక బరువుకి ముఖ్యమైన కారణాలు నిద్ర లేకపోవటం,అధిక ఒత్తిడి మరియు సరైన ఆహార నియమాలను పాటించకపోవటం.
ఎదురుగా అమ్మాయి లేదా అబ్బాయి ఉనప్పుడు ఊపిరి బిగపెట్టి పొట్టని బలవంతంగా లోపలికి దాచుకోడానికి ట్రై చేశారా.? ఖచ్చితంగా చేసే ఉంటారు. అలాగే మీకంటే సన్నగా నాజూకుగా ఉన్న వారిని చూసి కుళ్ళుకున్న సందర్భాలు కూడా ఉండే ఉంటాయి.
బరువు తగ్గడానికి జిమ్ కి వెళ్ళక్కర్లేదు, వెయిట్ లాస్ ఇన్స్టిట్యూట్ లో చేరాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ హెల్త్ టిప్స్ ఫాలో అయిపోండి చాలు.
- తగినంత నిద్రపోండి : ప్రతి రోజు 8 గంటలు నిద్రపోండి. నిద్ర సరిగ్గా లేకపోతే రోజంతా అలసటగా ఉంటాం. ఇదే మొదటి సలహా. పరిశోధనల ప్రకారం ఎవరైతే సరిగా నిద్రపోరో వాళ్ళు బాగా లావు అయిపోతారు.
- ఆకలిగా ఉన్నప్పుడే తినండి : ఈ నూతన సమాజంలో ఆకలిగా ఉన్నా లేకపోయిన, సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా బాగా తినేస్తుంటాం. ఏదో టాపిక్ డిస్కస్ చేసే టైం లోనో లేక టీవీ చుస్తూనో లేక ఫోన్లో మాట్లాడుతూనో లేక వర్క్ చేస్తూనో ఒక లిస్ట్ లాగించేస్తాం. చొక్కాకి ఉన్న బొత్తాలు తెగి పడేంత తినెస్తే ఎలా.? మీరు తినేటపుడు మీ పొట్టలో కనీసం ఒక 20% ఖాళి ఉండేలా చూస్కోండి.
- రాత్రి భోజనం త్వరగా చెయ్యండి : రాత్రి నిద్రపోవటానికి 2-3గంటల ముందే డిన్నర్ చేసేయండి.
- నీళ్ళు బాగా తాగండి : నీళ్ళు బాగా తాగాలి. ఎందుకంటే శరీరం మెటబోలిసం ని పెరిగే విదంగా చేసేది మనం రోజు తాగే నీళ్ళు ఒక్కటే. దాహం వేసినపుడు నీళ్ళు తాగాలి కాని షాప్ లో ఉండే అన్ని రకాల కూల్ డ్రింక్స్ ట్రై చేస్తే మనకే నష్టం. ప్రతిరోజూ కనీసం 4-5 లీటర్లు నీళ్లు తాగండి.
- తక్కువ ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకోండి : మీ బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకుంటే ఎక్కువ సార్లు తక్కువ ఆహరం తీసుకోవాలి. రెస్టారెంట్లకి వెళ్ళడం తగ్గించాలి. పెద్ద ప్లేటులో ఆహారాన్ని తీసుకుంటే మనకు తెలియకుండానే అధికమొత్తంలో తినేస్తాం కాబట్టి చిన్న ప్లేటులో తక్కువ ఆహారాన్ని తీసుకోవటం అలవాటు చేసుకోండి.
- రోజూ వ్యాయామం చెయ్యటం అలవాటు చేసుకోండి : ప్రతిరోజూ వ్యాయమం చెయ్యటం అలవాటు చేసుకోండి.చాలా మంది వాళ్ళ సమయాన్ని టీవీ చూడటంలోనో, ఆఫీస్ పనిలోనో, మొబైల్ చాట్టింగ్ బిజీలోనో ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉండిపోతారు. ఇలా చెయ్యటం వల్ల బద్దకం ఎక్కువ అవ్వటంతో పాటూ లావు కూడా పెరిగిపోతారు.
ఒత్తిడి ఎక్కువగా ఉన్న వాళ్ళ శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఒత్తిడి ఆకలిని పెంచి తద్వారా బరువు పెరిగేలా చేస్తుంది.కాబట్టి వీలైనంత వరకూ యోగా మెడిటేషన్ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. వీటితో పాటు ఈ కింది ఆహార నియమాలను పాటించండి.
ఆహార నియమాలు:
- ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాస్ లెమన్ వాటర్ తాగండి. గ్రీన్ టీ తాగటం అలవాటు చేసుకోండి.
- గోదుమలు,అటుకులు,రాగులు ఉన్న ఆహార పాదార్థాలను మీ ఆహారంలో భాగంగా చేసుకోండి.
- ప్రతి రోజూ 3-4 లీటర్ల నీటిని తాగండి.
ఈ నియమాలను ప్రారంభించేముందు ఒక విషయం గుర్తు పెట్టుకోండి. ఏది వెంటనే జరిగిపోదు, మన ప్రయత్నమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఎవరో చెప్పారని ఇన్స్టిట్యూట్స్ లో చేరడమో ట్రీట్ మెంట్ తీసుకోవటమో ఇవన్నీ మానుకోండి. ఈ సలహాలు కఠినంగా పాటించండి, సంతోషంగా ఉండండి.
Follow @timepasspopcorn