
అందంగా కనపడాలి అని ఎవరికి ఉండదు చెప్పండి..? కాని మనకు ఉన్న బద్ధకం కారణంగా సహజ పద్దతులని వదిలేసి ఖరీదైన ప్రొడక్ట్స్ ని నమ్ముకుంటాం. Instant Glow రావాలి అని మా Friend ఒకమ్మాయి 1200 రుపాయలు పెట్టి ఒక Product తెచ్చుకుంది.. వాడినప్పుడు పర్లేదు బాగనే ఉనింది. వాడటం మానేసాక చూడాలి దాని మొఖం. అలాగే మా Friend గాడు ఒకడు ఎంత చెప్పినా వినకుండా Advertisements చూసి తెగ Inspire అయిపోయి ఒక Product కొన్నాడు వాడటం స్తార్ట్ చెశాడు.. అంతే అసలే మనోడు Full colourful piece(అంటే కాకి బంగారం అన్నమాట) దానికి తోడు వాడి మొఖమంతా Pimples(మొటిమలు) వచ్చేసి అసలైన స్వదేసి కాకిపిల్లలాగ తయారయ్యడు.
కాబట్టి నేను చెప్పేది ఏంటంటే,
దయచేసి ఖరీదైన Products మానెయ్యండి. మన ఇంట్లో మనచుట్టూ ఉండే చవకైన వాటిని వాడటం వల్ల డబ్బు మిగలటంతో పాటు ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు, ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు.
కాబట్టి ఈ క్రింది చిట్కాలను ఫాలో అయిపోండి చాలు. అమ్మాయిలకే కాదండోయ్. అబ్బాయిలు కూడా ఫాలో అయిపోవచ్చు.
1.శెనగపప్పు(Bengal Gram) : శెనగపిండి + పెరుగు + కొంచెం పసుపు మిశ్రమాన్ని 15 నిమిషాలు మొఖానికి బాగా పట్టించి తర్వాత మొఖం కడిగెయ్యండి. ఇలా చెయ్యటం వల్ల మొఖం నున్నగా అవటంతో పాటు మొఖం మీద ఉన్న నలుపు కూడా తగ్గిపోతుంది.
2. తేనె (Honey) : తేనె సహజమైన రంగుని ఇవ్వటంలో ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. ఒక చెంచా తేనె లో నిమ్మరసం కలిపి మొఖానికి అప్ప్లై చేసి 15 నిమిషాల తర్వాత మొఖం కడుక్కోండి. అంతే చాలు.
3. బొప్పాయి (Papaya) : పపాయ గుజ్జులో తేనె / గ్రుడ్డు తెల్ల సొన వేసి బాగ కలిపి మొఖానికి అప్ప్లై చేసి 30 నిమిషాల తర్వాత మొఖం కడుక్కోండి.
4. పాలు (Milk): పాలు ప్రతిరోజు తాగే అలవాటు చాలమందికి ఉండే ఉంటుంది. తాగే ముందు ఒక 2 చెంచాలు పాలు తీస్కుని అందులో శెనగపింది + తేనె కలిపి బాగా మిక్స్ చేసి మొఖానికి అప్ప్లై చేసి 15 నిమిషాల తర్వాత మొఖం కడిగేసుకొండి. చాలు..
5. కీర(Cucumber) : కొంత కీర కట్ చేసి బాగా మెత్తని పేస్ట్ లాగా చేస్కుని 10 నిమిషలు మొఖానికి కి మస్సాజ్ చెస్కోండి. తర్వాత చూడండి..
6. వేపాకు (Neem): మీకు గుర్తు ఉండే ఉంటుంది మనం చిన్నప్పుడు మన అమ్మమ్మ లేదా అమ్మ వేడినీళ్ళలో వేపకు వేసి మరగబెట్టి స్నానం చేయించేవాళ్ళు. కాబట్టి మీరు కూడా ఇది ఫాల్లో అయ్పొండి.
7. టమాటా (Tomato) : టమాటా గుజ్జులో కాస్త నిమ్మరసం కలిపి మొఖానికి బాగా అప్ప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగెయ్యండి.
ఫైన తెలిపినవన్నీ సహజంగా దొరికేవే. కేవలం మనలో ఉండే బద్దకాన్ని పక్కన పెడితే చాలు మనకు మంచి నిగారింపు రావటం తో పాటూ మొఖం మీద ముడతలు, బ్లాక్ హెడ్స్ /వైట్ హెడ్స్ తొలగిపోవడంతో పాటూ అందంగా తయారవుతారు.
వీటితో పాటుగా ఈ క్రింది ఆహార నియమాలను కూడా పాటించండి:
1. Watermelon, Muskmelon : ప్రతిరోజూ రాత్రి మీ ఆహారంలో Watermelon లేదా Muskmelon ఉండేలాగ చుసుకోండి. దీనివల్ల మొటిమలు రావు మరియు మొఖం చాలా స్మూత్ గా తయారవుతుంది. పొట్ట కూదా తగ్గుతుంది.
2. Carrots,Oranges,Pomegranates,Guava : ప్రతిరోజూ పండ్లని మీ ఆహారంలో ఒక భాగం చేస్కొండి చాలు. మొఖం అందంగా తయారవ్వటం తో పాటూ ఒంట్లో ఉన్న ఎక్స్ట్రా కొవ్వు(Fat) కూడా తగ్గిపోతుంది .
3. Water : ప్రతిరోజు 4-5 లీటర్లు నీళ్ళు తాగటం అలవాటు చెస్కోండి. ఆ తర్వాత మిమ్మల్ని మీరే నమ్మలేరు.
అంతే సింఫుల్. జాగ్రత్తగా ఇవి పాటిస్తే ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది.
Follow @timepasspopcorn