చుండ్రు తగ్గటానికి 6 ముఖ్యమైన చిట్కాలు!!

Bootstrap Case

మీరు చుండ్రు (Dandruff) సమస్యతో బాధ పడుతున్నారా.? మీ సమాధానం అవును అయితే ఖచ్చితంగా మీరు ఈ ఆర్టికల్ చదవాల్సిందే. 
"సెబొరియ" అని శాస్త్రీయంగా పిలవబడే ఈ చుండ్రు వలన తల వెంట్రుకలు రాలటం, తల బాగా దురదలు పుట్టటం, తల పైన ఎర్రని మచ్చలు వచ్చి జుట్టు త్వరగా రాలిపోయి బట్టతల రావటం జరుగుతుంది. శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయోగాలు చేసినా చుండ్రు రావటానికి గల ప్రధాన కారణాలు మాత్రం తెలియరాలేదు.

చుండ్రు ముఖ్యంగా ఎందుకు వస్తుందో తెలుసా.?
1. సరిగా తల దువ్వకపోవటం వల్ల
2. సరిగా నిద్రపోకపోవటం వల్ల
3. అధికమైన శ్రమ
4. సరిగా ఆహారం తీస్కోకపోవటంవల్ల

కాబట్టి,
ఈ కింద తెలిపిన 6 చిట్కాలను పాటిస్తే ఖచితంగా మీ చుండ్రు సమస్య తీరిపోతుంది. ఖరీదైన షాంపూలు, ఆస్పత్రులు తిరగకుండానే 2 నెలల్లో సులభంగా తక్కువ ఖర్చుతో చుండ్రు ని దూరం చెయ్యవచ్చు.  

ప్రతి రోజూ 8 గంటలు నిడ్రపోండి. బాగా నిద్ర పోవటం వల్ల అలసట తగ్గి జుట్టు ఆరోగ్యంగా ఊడిపోకుండా ఉంటుంది.

1. ఆయిల్ మసాజ్ : 
తల స్నానం చేసేముందు నూనెను గోరువెచ్చగా వేడి చేసి తలకు బాగా రాసుకుని 30 నిమిషాల తర్వాత వెచ్చని తలస్నానం చెయ్యండి.

2. వేపాకు :  
వేపాకుని నీళ్ళలో వేసి బాగా మరగబెట్టి, ఆ నీటితో తలస్నానం చెయ్యండి. వేపాకులో ఔషదీయ గుణాల కారణంగా చుండ్రు త్వరగా తగ్గిపోతుంది.

3. ఉసిరి : 
ఉసిరికాయని తులసి ఆకులతో కలిపి బాగా నూరి అరగంట పాటూ తలకు పట్టించి వేడి నీటితో తలస్నానం చెయ్యండి.

4. కలబంద :  
ఔషదీయ గుణాలు కలిగిన కలబంద అన్ని రకాల జుట్టు సమస్యలకు సరైన పరిష్కారాన్ని ఇస్తుంది. 

4. మెంతులు : 
మెంతులు రాత్రంతా నానబెట్టి తలస్నానం చేసేముందు మెత్తని పేస్టులాగ చేసుకుని బాగ తలకి పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చెయ్యండి. ఈ విధంగా 4 వారాలు చెయ్యటం వల్ల చుంద్రు  ఖచ్చితంగా తగ్గిపోతుంది. 

5. కోడి గ్రుడ్లు : 
2 కోడి గ్రుడ్లు పగలగొట్టి తలకి బాగా పట్టించి 1 గంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఈ విధంగా చెయ్యటం వల్ల చుండ్రు తగ్గటంతో పాటు జుట్టు  రాలటం కూడా తగ్గిపోతుంది.  

వీటితో పాటు ఈ క్రింద తెలిపిన ఆహార నియమాలను కూడా పాటించండి. 
1. ప్రతిరోజూ ఉసిరికాయను తినండి
2. మీ ఆహారంలో చేపలు, మాంసం, చిక్కుళ్ళు,బాదం మొదలైన వాటిని తప్పకుండా తీస్కోండి.
3. విటమిను B అధికంగా ఉన్న ఆహారాన్ని తీస్కోండి. 
వేలకు వేలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్లు తీస్కోవటం కన్నా మనకు అందుబాటులో ఉన్న ఆహార నియమాలను పాటిస్తే మన తలను మనమే కాపడుకోవచ్చు కదా..!!

ఓసారి ఆలోచించండి. ఆరోగ్యంగా జీవించండి.

ఈ ఆర్టికల్ పైన మీ అమూల్యమైన సలహాలను కామెంట్లను తెలుపగలరు.

Article By Prasuna
-->